నూతన వధూవరులను ఆశీర్వదించిన పద్మారెడ్డి
22-05-2026 01:53 AM
పాపన్నపేట,మే21: పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గాదాస్ కుమారిడి వివాహం గురువారం అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హల్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మండల నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పాపన్నపేట్ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల పోరం మాజీ అధ్యక్షులు కుమ్మరి జగన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్ రావు, నాయకులు సోములు, సాయిలు, మల్లేశం, అంజి రెడ్డి తదితరులు ఉన్నారు.






