2 September, 2026 | 8:37 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

రాజోళిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

22-05-2026 | 01:53am

రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలింపు 

చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు 

అలంపూర్ మే 21: గద్వాల జిల్లా రాజోళి మండల శివారులోని తుంగభద్ర నది తీర ప్రాంతాల నుంచి ఇసుకను కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతా లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడి అధికారుల అండదండలతో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా కొందరు అక్రమార్కులు ఈ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో నదిని చరబట్టి పొక్లెయినర్ తో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో, టిప్పర్లలో అక్రమంగా ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానిక పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఈ తతంగం నడుస్తున్న సంబంధిత రెవెన్యూ శాఖ, పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా మైనింగ్ అధికారులు స్పందించి ఇసుక అక్రమా రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.