వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి
- లేకపోతే రాజీవ్ రహదారి దిగ్బంధం
- వంటేరు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్
గజ్వేల్, మే 31: గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీ నివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గజ్వేల్ మండలంలోని ఆయా గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో కలిసి కేంద్రాల పరిస్థితిని తెలుసుకు న్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, రెండు నెలలుగా రైతులు ఎండలో ధా న్యాన్ని నిల్వ ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆ రోపించారు. గన్ని బ్యాగులు, లారీలు, కాం టాలు సమయానికి అందుబాటులో లేక రై తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే జూన్ 4న కొండపాక, కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, ములుగు ప్రాంతాల్లో రాజీవ్ రహదారిపై వడ్లు పోసి భారీ దిగ్బంధం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






