బోరంచ పోచమ్మ సన్నిధిలో నైనా జైస్వాల్
నారాయణఖేడ్, మే 31: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక ఎమ్మెల్యే దంపతులు అనుపమ సంజీవరెడ్డి లు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారి ని అయినా నైనా జైస్వాల్ రావడం ఆనందించదగ్గ విషయమన్నారు.
ఆమెపై అమ్మ వారి ఆశీర్వాదం ఉండాలని అంతర్జాతీయ స్థాయి లో భారతదేశ కీర్తిని సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం నైనా జస్వల్ మాట్లాడు తూ బోరంచ పోచమ్మ తల్లి దర్శనానికి రా వడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మ రింత ముందుకు వెళతానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు, ఆలయ ఈవో శివ రుద్రప్ప, స్థానిక సర్పంచ్ బీరప్ప, ఆలయ కమిటీ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి నైనా జైస్వాల్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






