24 June, 2026 | 1:25 AM

21వేల మంది ఉద్యోగుల ఉద్వాసన

24-06-2026 12:25 AM

‘ఒరాకిల్’ సంచలన నిర్ణయం

సంస్థలో ఏఐ వినియోగానికి ప్రాధాన్యం 

టెక్సాస్, జూన్ 23: కృత్రిమ మేధను (ఏఐ) సంస్థలో భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్‌లోనూ ఈ కోతలు కొనసాగుతాయని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ తెలిపింది. గత 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు జూన్ 22న విడుదల చేసిన సంస్థ వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.

లేఆఫ్‌లతో ఉద్యోగుల సంఖ్య 1,41,000కు చేరి 13 శాతం తగ్గింది. ఒక సంవత్సరం క్రితం ఈ సంఖ్య 1,62,000గా ఉండేది. ఇందులో 49వేల మంది అమెరికా ఉద్యోగులుండగా, విదేశాల్లో 92 వేల మంది పనిచేస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి క్లౌడ్, డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్ వినియోగంపై ఎక్కువగా మొగు ్గచూపుతున్నాయి.

ఒరాకిల్ డేటా సెంటర్ల నిర్మాణంలో భాగమై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నగదు ఆదా, కార్యకలాపాల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు కోత పెడుతోంది. ఒరాకిల్ తన విస్తరణకు నిధులు సమకూర్చుకోవడానికి నగదును ఖర్చు చేయడం, రుణాలు జారీ చేయడంపై ఆధారపడింది. ఈ సంస్థ షేర్లు 2026లో 10 శాతం తగ్గి 70 బిలియన్ డాలర్ల నికర మూలధన వ్యయాన్ని అంచనా వేస్తుంది. గతంలో ప్రకటించిన 20 బిలియన్ డాలర్ల స్టాక్ జారీతో సహా, రుణం, ఈక్విటీ రూపంలో 40 బిలియన్లను సమీకరించనుంది.