డ్రగ్స్‌కు బానిసై తల్లిదండ్రుల ఆశలను సమాధి చేయొద్దు
24-06-2026 01:24 AM
ఎస్సై జలంధర్ రెడ్డి
పెద్దమందడి, జూన్ 23: విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై తమపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కలలను నాశనం చేసుకోవద్దని పెద్దమందడి ఎస్త్స్ర జలంధర్ రెడ్డి సూచించారు. వెల్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలపై 1930, ఇతర సమస్యలపై 1908 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాణం విష్ణు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






