23 June, 2026 | 11:03 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం

23-06-2026 09:33 PM

- క్రీడల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేసింది

- బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

- గజ్వేల్ లో ఒలంపిక్ డే రన్, ఉత్సాహంగా పాల్గొన్న యువత 

గజ్వేల్: గజ్వేల్ స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 27 ఎకరాల భూమిని కేటాయించిందని, క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేసిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధంతో గజ్వేల్ స్పోర్ట్స్ హబ్, వివిధ క్రీడా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్–2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

క్రీడలు యువతను ఆరోగ్యవంతమైన జీవనశైలివైపు నడిపిస్తాయని, సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌ను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని చెప్పారు.

"రన్ ఫర్ ఫిట్‌నెస్ – రన్ ఫర్ యూనిటీ–రన్ ఫర్ ఒలింపిక్ వాల్యూస్" నినాదంతో నిర్వహించిన ఈ పరుగు కార్యక్రమంలో 500 మందికి పైగా క్రీడాకారులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్, మాజీ జడ్పీటీసీ పంగా మల్లేశం, సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ రవికుమార్ యువతకు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు. పరుగు కార్యక్రమంలో పాల్గొన్న 500 మందికి పైగా యువతకు వంటేరు ప్రతాప్ రెడ్డి టీ-షర్టులు పంపిణీ చేయగా, అల్పాహారాన్ని సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ అందించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అతిథులు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సేవకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒలింపిక్ డే రన్ కన్వీనర్ కుంటనోళ్ల శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.