24 June, 2026 | 2:29 AM

కురిసిన వర్షం.. కదిలిన అరకలు

24-06-2026 01:22 AM

ఖరీఫ్ విత్తనాలు విత్తడం ప్రారంభించిన రైతులు

ఉట్నూర్, జూన్ 23 (విజయక్రాంతి): సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు అరకలు పట్టి పొలాల్లో విత్తనాలు వేయడం ప్రారంభించారు. మంగళవారం వేకువ జామున గిరిజన రైతులు వ్యవసాయ భూములకు పరుగులు తీశారు.

ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు ముందుగా కొనుగోలు చేసిన పత్తి, కంది, సోయా, తదితర విత్తనాలను పంట చేనులకు తీసుకువెళ్లి  పంట చేనులో విత్తనం ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి తాళం వేసి పంట చేనులకు పరుగులు తీశారు.