24 June, 2026 | 1:18 AM

గంజాయి మత్తులో.. ఆన్‌లైన్ ఉచ్చులో..

24-06-2026 12:40 AM
  1. అంధకారం అవుతున్న యువత భవిత
  2. గామాలకు విస్తరిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి 
  3. నివారించాలని ప్రజల వేడుకోలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 23 : పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ గేమ్స్,క్రికెట్ బెట్టింగ్,గంజాయి మత్తు క్రమక్రమంగా పల్లెలకు కూడా పాకుతుంది. అంతేకాకుండా గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో యువత మద్యానికి బానిసలు అవుతున్నారు.గతంలో పల్లెల్లో విచ్చలవిడిగా ఉన్న గుడుంబా దుకాణాలు ప్రస్తుతం కనిపించకుండా చేసిన అధికారులు బెల్టు షాపులను మాత్రం అరికట్టలేకపోతున్నారు.

జాజిరెడ్డిగూడెం మండలంతో పాటు మిగతా మండలాల్లోని గ్రామాలు,మండల కేంద్రాల్లో యువత గంజాయికి అలవాటు పడుతూ తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.ఎంత మందలించిన మార్పు ఉండటం లేదని కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా,గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి

.కొంతమంది యువత మద్యానికి,గంజాయి మత్తుకు బానిసై చదువు మధ్యలోనే ఆపేసి,అల్లరి చిల్లరగా తిరుగుతూ,తల్లిదండ్రులను వేధిస్తూ భలవర్మణాలతో పాటు హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారు.పోలీసులు,ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఆన్లైన్ గేమ్స్,క్రికెట్ బెట్టింగ్ తో పాటు గంజాయి,బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.

 బెల్టు షాపులు తీసివేయాలి

 పల్లెల్లో బెల్ట్ షాపుల వలన యువత చెడిపోతున్నారు. మద్యం దుకాణాలను మండల కేంద్రాలకు మాత్రమే పరిమితం చేయాలి. గ్రా మాల్లో బెల్ట్ షాపు లు 24 గంటలు అందుబాటులో ఉం డటంతో తాగుడుకు బానిసలు అవుతున్నారు. ఇళ్లల్లో పెద్దలు తాగి గొడవలు చేస్తుండడంతో పిల్లలు కూడా అదే తోవపడుతున్నారు.

బొడ్డు శంకర్, ఉద్యమకారుడు, తిమ్మాపురం

 వ్యసనాలకు దూరంగా ఉండాలి

చెడు వ్యసనాలకు,గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలి.పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా నిలపెట్టాలి.ఆన్లైన్ బెట్టింగులు,పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

 మేకల రాములు, ఎస్ హెచ్‌ఓ అర్వపల్లి