calender_icon.png 17 February, 2026 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల పీఠం దేవర కైవసం

16-02-2026 04:02:27 PM

- వైస్ ఛైర్పర్సన్ గా13 వార్డు సభ్యులు కాసుల రాములు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక

చేవెళ్ల(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవర సమతా వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వైస్ చైర్పర్సన్ గా కాసుల రాములు గౌడ్ ఎన్నికయ్యరు. ప్రిసైన్డ్ డింగ్ అధికారి బి. రంగా రావు మున్సిపల్ కమిషనర్ వెంకటేశం అభ్యక్షతన 18 మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అభ్యర్తుల ఎన్నిక జరిగింది. చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ గా 16వ వార్డు కౌసిలర్ దేవర సమత రెడ్డిని 15వ వార్డు కౌసిలర్ బండారి శైలజ రెడ్డి ప్రత్తిపాదించిగా 14వ వార్డు కౌసిలర్ మద్దెల శ్రీనివాస్ బాలరిచారు.

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గెలుపొందిన వార్డు సభ్యులు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ప్రమాణం స్వీకారం చేశారు. వైస్ చైర్మన్ గా 13వ వార్డు సభ్యులు కాసుల రాములు గౌడ్ ను 8వార్డు కౌసిలర్ ప్రత్తిపాదించిగా 11వార్డు కౌసిలర్ పైడ్ల మధుసూదన్ రెడ్డి బలపరిచారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికయారు. ఎన్నికైన సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంత రామ్మొహన్ మాజీ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి, ఇంచార్జ్ భీమ్ భరత్ శుభాకాంక్షలు తెలిపారు. నలుగురి కో ఆఫ్షన్ సభ్యులు ఎన్నిక ఈ నెల 20న జరుగనుంది.