ప్రజా దర్బార్ విజయవంతానికి అధికారుల విస్తృత ఏర్పాట్లు
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో(Praja Palana – Pragathi Pranalika) భాగంగా శనివారం తిరుమలాయపాలెం హెడ్‌క్వార్టర్స్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కూసుమంచి క్యాంప్ కార్యాలయం ఇన్‌చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కూర్చోవడానికి సౌకర్యాలు, వినతిపత్రాల స్వీకరణ కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మండల ఎస్సై కూచిపూడి జగదీష్, ఎంపీడీవో షేక్ సిలర్, ఎమ్మార్వో లూథర్ విల్సన్, ఎంపీవో ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, తిరుమలాయపాలెం సర్పంచ్ ధరావత్ సుజాత నరసింహారావు, మందడి ఇజ్రాయిల్, కొక్కిరేణి ఉపసర్పంచ్ సిరిగదే ఉపేందర్, మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ అంబేద్కర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్, చీమ లక్ష్మయ్య, దొడ్డ గురవయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






