6 May, 2026 | 9:27 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

కన్నాల శివారులో క్షుద్రపూజల కలకలం

28-02-2026 10:26 AM

కల్షం చెంబు పోయిందని క్షుద్ర పూజలు చేస్తున్న ముఠా వెతుకుతుంటే వెలుగులోకి

భయాందోళనలో గ్రామ ప్రజలు 

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల-పాత రచ్చపల్లి శివారులోని నిలగిరితోట లో క్షుద్ర పూజల(Occult worship) కళకళం రేపుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం కొత్త మంది వ్యక్తులు నాగపూజ పేరు తో గత 16 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఈ పూజలు 20 రోజులు చేస్తామని తెలుపుతున్నారని,  ఈ పూజలో  మహిళలు కూడ పాల్గొన్నారని తెలిపారు. ఈ పూజకు ఉపయోగించే కల్షం చెంబు పోయిందని క్షుద్ర పూజలు చేస్తున్న వారు శుక్రవారం రాత్రి తిరిగి వెతుకుతుండటంతో గ్రామస్తులకు విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళల్లో ఈ క్షుద్ర పూజలు చేస్తుండటంతో గ్రామ ప్రజలు భయందోనలు చెందుతున్నారు. పోలీస్ లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.