లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల గృహప్రవేశం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచులు జ్యోతి సురేందర్ రెడ్డి,అనిత గోపాల్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాగిరెడ్డిపేట్ మండలం కామారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
కావున ఇంకా చేపట్టలేని అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేస్తే మండలానికి గ్రామానికి ప్రజలందరికీ మంచి పేరు వస్తుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సకాలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని తెలిపారు.






