6 May, 2026 | 8:44 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలి

28-02-2026 10:17 AM

ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలి

అధికారులకు,కాంట్రాక్టర్లకు ఆదేశాలు

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

హుజూర్ నగర్: ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు.శుక్రవారం పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్ లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్  పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి  పూర్తిగా సిద్ధం చేయాలని అన్నారు.బ్లాక్ లో మధ్య గల  అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, మొక్కలు నాటడం, పెయింటింగ్ పనులు, స్ట్రీట్ లైట్స్ మొదలైన అన్ని రకముల పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా  పూర్తి చేయాలని సంబంధిత  అధికారులను, కాంట్రాక్టర్లను  ఆదేశించారు.కార్యక్రమంలో  హౌసింగ్ పిడి సిద్ధార్థ, మిషన్ భగీరథ ఇ.ఇ. కరుణాకర్ రెడ్డి, తహసిల్దార్ కవిత, తదితరులు పాల్గొన్నారు.