18 May, 2026 | 11:15 PM

విజయవాడలో ఫెదర్‌లైట్ ఎక్స్ క్లూజివ్ సెంటర్ ప్రారంభం

06-05-2026 09:19 PM

5 మే 2026 : కార్యాలయ, విద్యా ఫర్నిచర్ పరిష్కారాల పరంగా భారతదేశంలో ఎక్కువమంది విశ్వసించే సంస్థలలో ఒకటైన ఫెదర్‌లైట్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ సరికొత్త, ప్రత్యేక అనుభవ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించింది. విజయవాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయ రూపకల్పనలో భాగస్వామిగా నిలిచే ఉద్దేశంతో దీనిని లాంఛ్ చేసింది.  ఈ కేంద్రాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వివాటెక్ డైరెక్టర్ శ్రీ ఎస్. విజయ్ శ్రీ రామ్, వివాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విశాల్ సిద్ధంశెట్టి, ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరెన్ చెల్లారం మరియు ఫెదర్‌లైట్ గ్రూప్ డీలర్ మేనేజ్‌మెంట్ - బిజినెస్ హెడ్ శ్రీ నిరంజన్ డి. దేశాయ్ కూడా పాల్గొన్నారు.

ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ ధీరేన్ చెల్లారం మాట్లాడుతూ విజయవాడలోని మా కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో, కార్పొరేట్‌లు, విద్యా సంస్థలు, చిన్న వ్యాపార యజమానులు, పారిశ్రామికవేత్తలు మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వీటిలో ఎర్గోనామిక్ సీటింగ్ , సహకార కార్యాలయ ఏర్పాట్లు  నుండి సాంకేతిక ఆధారిత తరగతి గది ఫర్నిచర్, లేబరేటరీ బెంచీలు, లైబ్రరీ సిస్టమ్‌లు, ఆడిటోరియం సీటింగ్ , ప్రభుత్వ సంస్థల కోసం పలు రకార ఫర్నీచర్లు అందుబాటులో ఉంటాయవి తెలిపారు.