ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి మాట్లాడుతూ... ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉపాధి కూలీలు సమయానుసారాన్ని పాటించి ఉదయం పూటనే పనులకు వెళ్లి ఎండ సమయం కాకముందే పనులు ముగించుకోవాలని తెలిపారు.
మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది.ఇల్లు బాగుంటేనే సంసారం బాగుంటుంది.ప్రతి ఒక్కరు ఆరోగ్యం పరంగా శ్రద్ధ వహించాలన్నారు.తగినంత నీటిని తీసుకోవాలని తెలిపారు.ఉపాధి హామీ పనులపై ఏవైనా అనుమానాలు,సందేశాలు, సమస్యలు ఉంటే తెలపాలన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు నిర్వహించుకోవాలని తెలిపారు.ఉపాధి హామీ పనుల పేమెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.






