శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్ ముదిరాజ్!!
శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్ మాట్లాడుతూ వేసవి ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బ్యాంకుకు, మండల రెవెన్యూ కార్యాలయం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం రక్షకభట నిలయం వివిధ ప్రభుత్వ కార్యాలయమునకు వచ్చే ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని గుర్తించి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ ఇసు గారి మల్లేశం, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు శివంపేట గ్రామస్తులు యువకులు తదితరులు చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.






