రూ.1254 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించిన స్టార్ హెల్త్
హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి స్టాండ్‌ఎలోన్ ఆరోగ్య బీమా సంస్థల్లో ఒకటైన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పారదర్శకంగా, వేగవంతంగా కస్టమర్ల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే విధంగా సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది. ఈ ప్రాంతంలో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1,254 కోట్ల విలువైన 1.8 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.1,014 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించగా, అది ఈ ఏడాది 24 శాతం వృద్ధి చెందింది.
కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, ఇప్పటివరకు రూ. 6,064 కోట్లకు పైగా విలువైన 9.6 లక్షల క్లెయిమ్‌లను స్టార్ హెల్త్ సెటిల్ చేసింది. ఈ ప్రాంతంలో కంపెనీ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ప్రాంతీయంగా స్థూల రిటెన్ ప్రీమియం 2024-25లో రూ. 1,928 కోట్లుగా ఉండగా, 2025-26 నాటికి అది రూ. 2,268 కోట్లకు వృద్ధి చెందింది. అలాగే పాలసీల సంఖ్య కూడా 8.8 లక్షల నుండి 9.4 లక్షలకు చేరింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో స్టార్ హెల్త్ పటిష్టమైన సేవా నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో 1,800కు పైగా నెట్‌వర్క్ ఆస్పత్రులు, 75కు పైగా బ్రాంచీలు, 89,000 మందికి పైగా అడ్వైజర్లు, 1,800 మంది ఉద్యోగులు మరియు 230 స్టార్ గ్రామీణ బీమా కేంద్రాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో 15,000కు పైగా ఆస్పత్రుల నెట్‌వర్క్ మరియు డిజిటల్ సేవల ద్వారా కంపెనీ తన క్లెయిమ్‌లను వేగంగా ప్రాసెస్ చేస్తోంది. ప్రస్తుతం 75% క్లెయిమ్‌లు కంపెనీ యొక్క కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే నిర్వహించబడుతున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్లెయిమ్‌ల చెల్లింపులు 24% పెరగడం అనేది ప్రజల్లో ఆరోగ్య బీమా పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. 1.8 లక్షల క్లెయిమ్‌ల ద్వారా రూ.1,254 కోట్లు చెల్లించడం కేవలం వృద్ధి మాత్రమే కాదు, మాపై ప్రజలకు ఉన్న నమ్మకం. కుటుంబాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రత, దీర్ఘకాలిక సంక్షేమ ప్రణాళికల్లో ఆరోగ్య బీమా కీలకంగా మారిన నేపథ్యంలో మేము క్లెయిమ్‌ల ప్రక్రియను మరింత వేగవంతంగా, సరళంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామనీ .స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఆనంద్ రాయ్ తెలిపారు.
కేవలం క్లెయిమ్‌ల పరిష్కారానికే పరిమితం కాకుండా జిల్లాల్లో ఆరోగ్య సంరక్షణ అందించే లక్ష్యంతో 'ఆరోగ్య సేవ కేంద్ర' అనే సీఎస్ఆర్ కార్యక్రమాన్ని స్టార్ హెల్త్ నిర్వహిస్తోంది.






