విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి
నేరేడుచర్ల ఎం.ఈ.వో. బాలు
నేరేడుచర్ల, జూన్ 12: పీఎంశ్రీ జడ్.పి.హెచ్.ఎస్ నేరేడుచర్ల నందు మండల పరిధి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు.మధు,ఎల్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరియు మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీ వారికి మధ్యాహ్న భోజన నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంఈఓ ఎం బాలు మాట్లాడుతూ, విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం రుచికరంగా తయారుచేసి వడ్డించాలని, పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వంట సామగ్రి, వంటగది పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని మంచినీటి ట్యాంకుల శుభ్రతకోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి సత్యనారాయణ రెడ్డి, పరశురాములు, రవీందర్ రెడ్డి,ఎం శ్రీనివాస్ రెడ్డి,చల్లా వెంకటేశ్వరరావు,పి శ్రీధర్, వై సత్యనారాయణ రెడ్డి ఆర్ శ్రీనయ్య, శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ పద్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






