చీపునుంతల అభివృద్ధికి నిధులు కేటాయించండి
30-07-2026 01:17 AM
సీఎస్ సంజయ్ జాజుకు మహేష్ వినతి
తలకొండపల్లి,జులై 29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీస్ ) సంజయ్ జాజును సచివాలయంలో తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గుజ్జుల మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని గుజ్జుల మహేష్ ఈ సందర్భంగా సీఎస్ను కోరారు. వినతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సానుకూలంగా స్పందించినట్లు మహేష్ తెలిపారు.






