13 June, 2026 | 4:11 AM

ప్రభుత్వ పాఠశాలలకు కేంద్రం నుంచి అధిక నిధులు ఇప్పించాలి

13-06-2026 01:45 AM

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

ముకరంపుర, జూన్ 12 (విజయ క్రాంతి): కరీంనగర్ ఎంపీగా ప్రభుత్వ విద్యపై ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడని బండి సంజయ్ మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను స్వచ్ఛతగా పరిశుభ్రంగా ఉంచాలంటూ రెండు రోజులు హడావుడి చేయడం రాజకీయ ప్రచారం కొరకేనని, బండి సంజయ్ కి ప్రభుత్వ విద్య పై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు తీసుకువచ్చి కేంద్రం నుండి ఉన్నత విద్యాసంస్థలను కరీంనగర్ లో ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని రెడ్డి డిమాండ్ చేశారు.