ఘనంగా ఎన్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవం
04-05-2026 01:28 AM
సంస్థాన్ నారాయణపూర్, మే 3:సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఐఎన్టియుసి 80వ ఆవిర్భావ దినోత్సవం మండల అధ్యక్షులు దౌల గణేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతూ అసంఘటిత కార్మికులను ఏకం చేస్తూ హక్కుల సాధన కోసం నిరంతరంగా ఐఎన్టియుసి కృషి చేస్తుందని అన్నారు.భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం ముందుండి కోట్లాడుతుందని తెలిపారు.
జెండా ఆవిష్కరణ చేసి సీట్లు పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ అలీ, భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షులు పులమోని శంకర్,దుర్గం గాలయ్య,సిరిపంగి దశరథ, శ్రవణ్,అంతటి స్వామి,తదితరులు పాల్గొన్నారు.






