4 May, 2026 | 5:07 AM

తాళ్ల మల్కాపురంలో కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాల అందజేత

04-05-2026 01:27 AM

గరిడేపల్లి, మే 3 :  మండల పరిధిలోని తాళ్ల మల్కాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ఆదివారం భారీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయ పనుల కోసం తమ వంతు బాధ్యతగా దాతలు విరాళాలను ఆలయ కమిటీకి సమర్పించారు.

వట్టికూటి యశ్వంత్ తల్లి రాధా, వట్టికూటి రాంబాబు ధర్మపత్ని సరిత, వట్టికూటి అంజయ్య (లాయర్), ధర్మపత్ని శ్రీలత కలిసి రూ. 1,10,116/- నగదును అలాగే, వట్టికూటి శేషయ్య ధర్మపత్ని సరోజనమ్మ, వారి కుమారుడు నాగరాజు ధర్మపత్ని స్వరూప,వంశీ కలిసి రూ. 30,116/- విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గ్రామంలో గౌడ కులస్తులందరూ ఐకమత్యంతో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమని కొనియాడారు. భక్తులు,దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు