27 June, 2026 | 1:12 AM

నిర్మల్ పోలీస్... మీ పోలీస్...

27-06-2026 12:08 AM
  1. ప్రజావాణి పిటిషన్ల ను నిర్లక్ష్యం చేయవద్దు 
  2. జిల్లా ఎస్పీ జానకి షర్మిల 

నిర్మల్ జూన్ 26 ( విజయక్రాంతి): జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు శుక్రవారం పెండింగ్లో ఉన్న పిటిషన్ల పురోగతిపై జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న పిటిషన్లను ప్రత్యేకంగా సమీక్షించి, వాటి విచారణను వేగవంతం చేయాలని సూచించారు.ప్రతి ప్రజావాణి పిటిష్ప ఎప్పటికప్పుడు ఫాలోఅప్ నిర్వహించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజావాణి కార్యక్రమం కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు.