యాదగిరిగుట్ట ఈవో పదవి కాలం పొడిగింపు
27-06-2026 01:08 AM
ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
యాదగిరిగుట్ట, జూన్ 26 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ పదవిని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈవో భవాని శంకర్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన సేవల కల్పనను దృష్టిలో ఉంచుకుని, పదవీ విరమణ పొందిన మరుసటి రోజు నుంచి అమల్లోకి వచ్చేలా ఏడాది కాలపరిమితితో ఈవోగా నియమించారు.






