30 April, 2026 | 3:02 PM

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి

30-04-2026 01:13 PM

రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ

గుండాల,(విజయక్రాంతి): పోడు రైతు నుండి పది వేల రూపాయల లంచం తీసుకుంటున్న మండల పరిధిలోని నడిమిగూడెం బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్ ను ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు ఫిర్యాదుతో నిఘా పెట్టిన అధికారులు డబ్బులు తీసుకుంటున్న సమయంలో అతడిని పట్టుకున్నారు. మారుమూల గ్రామాల నుండి ఏసీబీ కి ఫిర్యాదులు అందే విధంగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. ఫిర్యాదు రాగానే స్పందించడంతో ప్రజల్లో అధికారుల మీద గౌరవం పెరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మండలంలోని సాయనపల్లి గ్రామ పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఈ లంచం తీసుకుంటూ బీట్ అధికారి నరేష్ ఏసీబీకి చిక్కారు.