calender_icon.png 12 February, 2026 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు

12-02-2026 07:13:49 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో గురువారం జిహెచ్ఎంసి పరిధి బోడుప్పల్ సర్కిల్ లోని బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు సమ్మెలో పాల్గొని, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్.సృజన, సిఐటియు జిల్లా నాయకులు చింతల యాదయ్య, సబిత, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బాల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.