calender_icon.png 12 February, 2026 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనిలో కూలీల సంఖ్య పెంచాలి: ఎంపీడీవో జ్యోత్స్న

12-02-2026 07:16:17 PM

వాంకిడి,(విజయక్రాంతి): ఉపాధి హామీ పనులకు కూలీల హాజరు శాతం పెరిగేలా చూడాలని, వాంకిడి ఎంపీడీవో జ్యోత్స్న అన్నారు. మండలంలోని నవేగూడ, ఇందాని గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. కూలీల హాజరు, పనుల నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని, కొలతల ప్రకారం పనిచేయడం వల్ల రోజుకు రూ.307 పొందవచ్చుని అన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులు సకాలంలో పూర్తి చేయాలని అప్పుడే పంచాయితీల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, వంటశాల మరుగుదొడ్ల పనులను పరిశీలించి, పనుల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులు సమయానికి పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఎంపీడీవో వెంట ఏపీఓ శ్రావణ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శులు దినేష్, శ్రీనివాస్ రెడ్డి,క్షేత్ర సహాయకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు.