సైబర్ ప్రొటెక్షన్ సిస్టమ్‌పై అవగాహన
ముగిసిన ‘మెగా హ్యాకథాన్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): గూగుల్ జెమినీ, ఏఐ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, హైదరాబాద్‌లోని లార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మెగా హ్యాకథాన్ సీజన్ ఆదివారం ముగిసింది. ‘సైబర్ సెక్యూరిటీ సవాళ్లు’ అంశంపై నిపుణులు అవగాహన కల్పించారు.
డిజిటల్ హ్యాకర్ల నుంచి రక్షణ పొందడానికి ‘ప్రొటెక్షన్ సిస్టమ్స్’ను డిజైన్ చేసుకోవాలని సూచించారు. హ్యాకథాన్‌కు 25 రాష్ట్రాల నుంచి 550 మంది మేధావులు హాజరయ్యారు. 36 గంటల నాన్-స్టాప్ సాంకేతిక పోటీల్లో వీరు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రొటెక్షన్ సిస్టమ్స్, వినూత్న ఐడియాలు ప్రదర్శించిన విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 3,500 పైగా దరఖాస్తులు వచ్చాయి.






