15 June, 2026 | 3:17 AM

బీబీకి విచక్షణే లేదు !

15-06-2026 01:58 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం

వాషింగ్టన్, జూన్ ౧౪: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బీబీ(బెంజమిన్ నెతన్యాహు)కి అసలు విచక్షణే లేదని తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లెబనాన్ రాజధాని బైరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల పట్ల ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే సమయంలో దాడులేంటని నెతన్యాహుపై నిప్పులు చెరిగారు. కీలకమైన సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, ఇకపై ఎలాంటి దాడులు జరగకూడదని సూచించారు.

పశ్చిమాసియా ఉద్రిక్తలను అర్థం చేసుకోవడంలో నెతన్యాహు విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల శాంతి ఒప్పందానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. ముందనుకున్న ప్రకారమే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. మరోవైపు, బైరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులను ఇరాన్ సైనిక అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ తీవ్రంగా స్పందించారు. దాడులకు ఖచ్చితంగా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, శాంతి ఒప్పందంలో భాగంగా ఒప్పటికే అమెరికాలో స్తంభింపజేసిన 25 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.