బాధ్యతలు స్వీకరించిన కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు
మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ కమిషనర్లు
కామారెడ్డి, మే 4 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన రాజేందర్ రెడ్డిని మున్సిపల్ పాలకవర్గం ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం విధితమే. ఆయన స్థానంలో శంషాబాద్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డికి మున్సిపల్ కమిషనర్ గా పర్వతాలు సోమవారం కామారెడ్డిలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ కలిసి మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందజేశారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన మహేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు జగ్జీవన్ ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లి ఆదర్శ మున్సిపాలిటీ లుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శంషాబాద్ ఏఎంసీగా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డికి వచ్చిన టి. పర్వతాలు సోమవారం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అలాగే, నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసి బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చిన జగ్జీవన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.






