5 May, 2026 | 3:37 AM

మినుముకుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

05-05-2026 12:59 AM

జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ 

వనపర్తి, మే 4 (విజయక్రాంతి) :  మినుము కుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ లు డిమాండ్ చేశారు. సోమవారం  రైతులతో కలసి వారు ధ్వంసం అయిన ప్రదేశాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపి ఇరిగేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  మాణిక్యం,  రఘు వర్ధన్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి చిట్యాల రాము,తదితరులు పాల్గొన్నారు