9 July, 2026 | 1:32 AM

పవిత్ర ఉమ్రా యాత్రకు ముజీబ్

09-07-2026 12:38 AM

కుటుంబ సభ్యులతో బయలుదేరిన టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ఎం హుస్సునీ (ముజీబ్) తమ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా, మదీనా క్షేత్రాలకు ఉమ్రా యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓస్ సెంట్రల్ యూనియన్ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు ముజీబ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉమ్రా యాత్ర అనేది ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటి. ఈ పవిత్ర యాత్రను కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించడం ఎంతో విశిష్టమైనదని పేర్కొం టూ, ఈ యాత్ర ద్వారా ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయు రారోగ్యాలు, సుఖశాంతులు, అల్లాహ్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.