9 July, 2026 | 2:16 AM

సంక్షేమ పథకాలకు ఆద్యుడు వైయస్సార్

09-07-2026 01:30 AM

మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ 

కేసముద్రం, జూలై 8 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాల పేద ప్రజల సంక్షేమానికి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి ఆద్యుడిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలిచాడని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు..కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతాంగానికి కొండంత అండగా నిలిచాయన్నారు.

ఆయన తీసుకున్న ఉచిత విద్యుత్ నిర్ణయం, రైతుల రుణమాఫీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాయన్నారు.  వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమల కోసం ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దసురు నాయక్, డిసిసి అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోత్ వెంకన్న, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, కదిరే సురేందర్, కూరెల్లి సతీష్, సారంపల్లి మోహన్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు, , చిలువేరు సమ్మయ్య గౌడ్, బానోత్ బధ్య, శ్రీరామ్ కిరణ్ మాజీ ఎంపిటిసి బాలు, పోలేపల్లి వెంకట్ రెడ్డి, రషీద్ ఖాన్ పాల్గొన్నారు.