డిగ్రీకళాశాలలో మొక్కలు నాటిన అధ్యాపకులు
09-07-2026 01:28 AM
కొత్తపల్లి, జూలై 8 (విజయక్రాంతి): కరీంనగర్లోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఏస్‌ఓ) ఉపప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పురుషుల డిగ్రీ కళాశాలలో గణితశాస్త్రం, గణాంకశాస్త్ర విభాగం సహకారంతో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఐఎస్‌ఎస్) శ్రీ రాజేష్ కుమార్, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీ గోవర్ధన శ్రీనివాసరావు, 6వ డివిజన్ కార్పొ రేటర్ మేకల వెంకటేష్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. అనూష, విభాగాధిపతి డాక్టర్ ఎం. ఉదయ్ శంకర్, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఓ అధికారు లు, బోధనేతర సిబ్బంది, పాల్గొన్నారు.






