9 July, 2026 | 1:33 AM

ఎస్సీ వసతిగృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి

09-07-2026 12:37 AM

బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి హామీతో ఆందోళన విరమణ

బాన్సువాడ, జూలై 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ గరల్స్ హాస్టల్ లో ఆత్మ హత్య చేసుకున్న అమృత కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. వార్డెన్ ను సస్పెండ్ చేసి బాధిత కుటుంబాన్ని 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అమృత ఆత్మహత్యపై విచారణ చేయించి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ హామీ ఇవ్వడంతో రాస్తా రోకో ను విరమించారు.