ఆదివాసులపై అక్రమ కేసులను నిలుపుదల చేయాలి
మంగపేట, జూలై 8 (విజయక్రాంతి):.ములుగు జిల్లా మంగపేట మండలంలోని పద్మూర్ రెవెన్యూ గ్రామం గంపొనిగూడెం ఆదివాసి గిరిజన రైతులు ఎన్నో ఏళ్లగా సాగు చేస్తున్న పోడు భూములను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసి ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మంగపేట మండలం అధ్యక్షుడు పోలేబోయిన ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి తాటి నాగరాజు డిమాండ్ చేశారు.
బుధవారం వారు మాట్లాడుతూ గతంలో సర్వేనెంబర్ 107/1లో 609-11, సర్వేనెంబర్ 108, లో 928-13, సర్వేనెంబర్ 125/1లో 770-30 ఎకరములు మొత్తం విస్తరణ 2418-03 ఎకరముల మూడు గంటల భూమిని గతంలో 01-08-2017 నుండి 31-08-2017వరకు రెవెన్యూ శాఖ అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేశారని, ఇట్టి భూమి సర్వే చేసి నివేదిక ప్రకారం రెవెన్యూ భూమా, అటవీశాఖ భూమా నిర్ధారణ చేసి నిరుపేద ఆదివాసి గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు లేదంటే, అటవీ హక్కుల చట్టం ప్రకారంగా హక్కు పత్రాలు ఇవ్వాలని అప్పటి ఉప కలెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ ఐటిడి ఏటూరునాగారం ఆర్సీ.ఎ/17/2017తేది 22-06-2017 రోజున ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
అయితే ప్రభుత్వ అధికారులు కాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, స్థానిక ఆదివాసులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం అంటూ హెచ్చరించారు. ఆదివాసి ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పోలేబోయిన ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి తాటి నాగరాజు, మన్య సీమ నాయకులు పునేం రాములు, తోలేం సుధాకర్, గొప్ప చంద్రకాంత్, కొమరం రవి, మన్య సీమ మహిళ నాయకురాలు ఇరుప అరుణ, తోలేం సౌమ్య, వాగబోయిన లావణ్య పూనెం నిర్మల, పుసం సావిత్రి పాల్గొన్నారు.






