పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, జూలై 5 (విజయక్రాంతి): ఉట్నూర్ మండలం పులిమడుగు వద్ద 4.5 కోట్లతో నిర్మించిన నూతన వంతెనను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఆదివారం పులిమడుగు వాగు వద్ద కేవలం రెండున్నర నెలలలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ ముంతాజ్ ని ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చాలా తక్కువ సమయంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ నీ ఎమ్మెల్యే అభినందించారు.ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, వంతెనల నిర్మాణాలు జరుగుతు ఉన్నాయని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం,ఖానాపూర్ నియోజకవర్గం అబివృద్ధి చెందుతుంది గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డి ఈ అరవింద్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






