6 July, 2026 | 2:52 AM

శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు: జిల్లా ఎస్పీ నరసింహ

06-07-2026 01:49 AM

కోదాడ, జూలై 5 : శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని జిల్లా ఎస్పీ నరసింహ పోలీసులకు సూచించారు. ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. తొలుత పట్టణ పోలీస్ సిబ్బంది ఎస్పీకి గౌరవంతో స్వాగతం తెలిపారు, పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పోలీసు కావాతును పరిశీలించి, పోలీస్ సిబ్బంది సామాగ్రిని తనిఖీ చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ యొక్క పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనంలో ఉన్న వాహనాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ ను తనిఖీ చేసి ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదులపై పోలీసు స్పందన ను పరిశీలించారు.

స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రకాల అధికారులను పరిశీలించారు, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల తీరు, కేసుల దర్యాప్తు ను పరిశీలించారు. కేసుల్లో దర్యాప్తు ఫిర్యాదుల, ఫిర్యాదుల దర్యాప్తును పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వేగవంతమైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇండ్లకు వెళ్లి కేసులు నమోదు చేసే డోర్ స్టెప్ ఎఫ్‌ఐఆర్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. రౌడీలు, షీటర్స్ పై నిగా ఉంచి వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణంలో ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ రాత్రింబవళ్లు కృషి చేస్తుంది, సమాజ భద్రత, నేరాలు నివారించడంలో పట్టణ పౌరులు వ్యాపారులు ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎక్కువ మొత్తంలో సిసిటివి కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ప్రజలకు ప్రజల ఆస్తులకు మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా ఆధునిక పద్ధతులను అవలంబించి పట్టణాన్ని పోలీసు సెక్టార్లుగా విభజించి నిరంతరం పోలీసు గస్తీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు.

పట్టణంలో సామాన్య పౌరులకు సామాన్య వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణ కోసం ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రౌడీషీటర్స్ పై ప్రత్యేకంగా ఉంచామని అన్నారు. కోదాడ పట్టణం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆనుకొని ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని ప్రయాణ సమయంలో వాహనదారులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. మన సమాజాన్ని మన పిల్లలను డ్రగ్స్ అనే భూతం పట్టి పీడిస్తుందని గంజాయి లాంటి మత్తు పదార్థాలను పట్టణంలోకి రాకుండా సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని కోరారు.

మహిళలు పిల్లల భద్రతలో ప్రాధాన్యమిస్తూ పనిచేస్తున్నామని మహిళలను ఎవరైనా వేదించిన ఇబ్బందులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి రవి, పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దుం అలీ, ఎస్ ఐ లు అంజి రెడ్డి, సుదీర్, ఉపేందర్ రెడ్డి, మ ల్సూర్, ఆర్‌ఎస్‌ఐ అశోక్, డిసిఆర్బి సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, ఐటి కోర్ కానిస్టేబుల్ ఆబేద్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు