టీ స్టాల్ ఒక వ్యాపారమే కాదు
కుటుంబానికి జీవనాధారం
కష్ట పడి పనిచేసే వారికీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గం.
91 టి స్టాల్స్ ను పంపిణి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, జూన్ 5 (విజయక్రాంతి): కష్ట పడి పని చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి మరింత ఊతం ఇచ్చేందుకు తన వంతు సహాయంగా సిద్దిపేట నియోజకవర్గంలో టి స్టాల్స్ పంపిణి చేశారు. నెక్ సంస్థ వారి సహకారంతో సిద్దిపేట నియోజకవర్గంలోని 5 మండలాలో టి స్టాల్ పంపిణి చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ ఒక్కో టి స్టాల్ రూ.80వేల విలువ గల స్టాల్ మొత్తం 91 మందికి అందజేసి మాట్లాడారు. మీ కష్టానికి నా వంతుగా తోడుగా, ఉడుతా భక్తిగా ఈ స్టాల్స్ అందిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది బండి మీద మీరు హోటల్ పెట్టుకొని, కొంతమంది రోడ్డు మీద పెట్టుకొని ఉండే వాళ్లకు స్థాల్ ఉండాలనే ఉద్దేశ్యంతో స్టాల్ ఇస్తున్నట్లు చెప్పారు.
కష్ట పడే వారికీ చేయూత, ప్రోత్సాహం, నా సహకారం ఉంటుందన్నారు. టి స్టాల్ వ్యాపారమే కాదు, మీ కాళ్ల మీద మీరు నిలబడి మీ కుటుంబానికి జీవనదారమని చెప్పారు. కష్టపడి పని చేసే వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గమని, నిజాయితీగా చేసే వ్యాపారం విజయానికి పునాది అవుతుందన్నారు. మీ వ్యాపారం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టి స్టాల్స్ తో పాటు గ్యాస్ సిలెండర్, స్టవ్, ఎల్ ఈ డి లైట్స్, ఫ్యాన్, 12 స్పూన్స్, 12 ప్లేట్స్, వాటర్ బాటిల్స్, 2కేజి హాట్ కేస్, 3కేజి డిక్ష, వాటర్ క్యాన్, చాకు, 2 గిన్నెలు ఇలా అవసరమైన సామాగ్రి అందజేశారు.






