6 July, 2026 | 2:52 AM

సిద్ధాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా

06-07-2026 12:41 AM

కొత్తూరు, జూలై 5 (విజయక్రాంతి): సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ఆదివారం కొత్తూర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కొత్తూరు మండల బీజేపీ అధ్యక్షుడు అత్తాపురం మహేందర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనకు పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ సీఎం, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డు ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామాల ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.