ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి టాపర్లకు ఘన సత్కారం
ఎర్రవల్లి తేదీ ఏప్రిల్ 20 : ఇటీవల విడుదలైన సిబి ఎస్ ఈ 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సోమవారం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొని విద్యార్థులను అభినందించి, షీల్డ్లు మరియు శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి వారి కష్టపడి చదివిన శ్రమతో పాటు ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం ముఖ్య కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. టి. భవ్యశ్రీ, ఆఫియా తబస్సుం చంద్ర సిద్ధార్థ్ లు 97 శాతం, టి. సింహసాధన్, కృష్ణ సాయి 96శాతం సాధించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






