17 June, 2026 | 2:49 AM

ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం..

17-06-2026 01:41 AM

బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపు

మునుగోడు, జూన్ 16 : పాలించే నాయకున్ని ఎన్నుకునేందుకు సామాన్యునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత అధ్యక్షతన ఏర్పాటు చేసిన జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) శిక్షణ కార్యక్రమానికి, ఏఐసీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

మునుగోడు నియోజకవర్గంలో ఓటు విలువ గణనీయంగా పెరిగిందని, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు కూడా మునుగోడులోనే తమ ఓటు కొనసాగించుకునేలా ఒక ప్రత్యేక గుర్తింపు అని అన్నారు.అభివృద్ధి జరగాలంటే మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని ఆయన అన్నారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో అత్యంత సీరియస్గా పనిచేయాలి‘ అని సూచించారు.

పీసీసీ నియమించిన మాస్టర్ ట్రైనర్ నుమాన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటర్ల మ్యాపింగ్, అన్మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న వారి వివరాల పరిశీలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా బీఎల్‌ఏలు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.