17 June, 2026 | 4:03 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

17-06-2026 02:47 AM

చేగుంట, జూన్ 16: చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పులిమామిడి గ్రామానికి చెందిన గజ్వేల్ అరవింద్(20) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజువారీ మాదిరిగానే సోమవారం విధులకు వెళ్లిన అరవింద్ రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా ఇబ్రహీంపూర్ వడ్డెర కాలనీ సమీపంలో రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అరవింద్ ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి గజ్వేల్ రేణుక ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సె చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.