17 June, 2026 | 1:50 AM

గాలిలో దీపాలు.. గీత కార్మికుల ప్రాణాలు..

17-06-2026 01:08 AM

భరోసా లేని బతుకులు 

మహబూబాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తాటిచెట్టు ఎక్కి దిగేంతవరకు ప్రాణాలకు భరోసా లేని బతుకులుగా గీత కార్మికుల జీవితాలు మారిపోయాయి. ఇటీవల కాలంలో గీత కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాదిమంది గౌడ కులస్తులు గీత వృత్తిని జీవనంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని తాటి చెట్టు ఎక్కి దిగేంతవరకు ప్రాణాలను బిగ పట్టుకుని వృత్తిని కొనసాగిస్తున్నారు.

కుటుంబ పోషణ కోసం ఎన్నో ఏళ్లుగా కల్లుగీత వృత్తిని ఆధారంగా చేసుకుని అనేక కుటుంబాలు ప్రాణాలను సైతం పణంగా పెడుతూ జీవనం వెల్లదీస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశా త్తు జరిగిన అనేక సంఘటనలో కల్లు గీత కార్మికులు మృత్యువాత పడడం, ఇంకొందరు తీవ్రంగా గాయపడి జీవచ్ఛవాలుగా జీవితాలను కొనసాగిస్తున్నారు. కుటుంబ పెద్దదిక్కు ప్రమాదంలో మరణించడం, తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన ఘటనల్లో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుంది.

పూర్తిగా కళ్ళు గీత వృత్తిని కొనసాగించడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం వల్ల తెలంగాణ రా ష్ట్రంలో గీత కార్మికులు చాలామంది ఇదే వృత్తిని తప్పనిసరిగా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేసి నప్పటికీ కల్లుగీత వృత్తిదారుల్లో ఏమాత్రం ఎదుగు బొదుగు లేకుండా పోయిందని, ప్రమాదంలో మరణించిన, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు పరిహారం అందించడం లో జాప్యం జరుగుతోందని, ఫలితంగా కు టుంబాలు ఆర్థికంగా చితికిపోయి, దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయ ని చెబుతున్నారు.

గత వారంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాటి చెట్ల పైనుండి ప్ర మాదవశాత్తు జారిపడి పలువురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం రేగొండ మండలంలో సదయ్య గౌడ్ తాడిచెట్టు పై నుండి పడి దు ర్మరణం పాలయ్యాడు. మంగళవారం కేసముద్రం మండలం కల్వల గ్రామంలో వేము ల చిన్న మల్లేశం ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

అలాగే కేసముద్రం, అబ్బాయిపా లెం, అమ్మపురం తదితర గ్రామాల్లో గీత కా ర్మికులు తాటిచెట్ల పై నుండి పడి తీవ్రంగా గాయపడడం, కొందరు చనిపోవడం ఇలాం టి సంఘటనలు 20 కి పైగా జరిగాయి. ప్ర త్యామ్నాయ ఉపాధి మార్గాలు లేక చాలామంది వంశపారంపర్యంగా కళ్ళు గీత వృ త్తినే తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నా రు. తాటి చెట్టు ఎక్కి దిగేంతవరకు ప్రాణాల కు గ్యారెంటీ లేని అత్యంత ప్రమాదకరమైన వృత్తిని కొనసాగిస్తున్నా ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలి

తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలి. ఐదేళ్ల క్రితం ప్రమాదంలో మరణించిన అనేక కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి పరిహారం అందలేదు. దీనితో ఆ కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయాయి. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలో వెంటనే స్పందించాలి.

అలాగే కల్లుగీత పూర్తి దారులు అందరికీ కాటమయ్య కిట్లు అందించి, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. కొందరు కళ్ళు గీత కార్మికులకు ప్రభుత్వం అందజేసిన కాటమయ్య కిట్లను తప్పనిసరిగా వినియోగించుకోవడం వల్ల ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. 

 వెంకన్న, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి