రోడ్లపై ఆక్రమణలు అరికట్టేందుకు ఆపరేషన్ రోప్
కోదాడలో ఫుట్పాత్ల స్వాధీనం
కోదాడ, జాన్ 16: కోదాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణతో పాటు పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మంగళవారం కోదాడలో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఖమ్మం చౌరస్తా నుంచి ఖమ్మం రోడ్డువరకు ప్రధాన మార్గంలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన తోపుడు బం డ్లు, దుకాణాల విస్తరణలు, ఇతర అడ్డంకులను తొలగించి సంబంధిత వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో ఆక్రమణలు పునరావృతం కాకుండా దుకాణాల ముందు రెడ్లైన్ గీతలు గీశారు.
ఆ గీతలను దాటి రోడ్డుపైకి వస్తువులు, ప్రకటన బోర్డులు లేదా ఇతర సామగ్రిని ఉంచరాదని వ్యాపారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజలు, వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పాదచారుల భద్రతకు సహకరించాలని ఎస్‌ఐ అంజిరెడ్డి కోరారు. రహదారులపై అక్రమ ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






