ఇది స్కామ్‌ల సర్కార్
కేసీఆర్ పాలనలో స్కీంలు
- 2,00౦ కోట్ల టెండర్ వేసి 600 కోట్లకే వేశామన్న మంత్రులు
- టెండర్ విషయం తెలియని మంత్రులు
- ఇదేం పాలనో?
- రీయింబర్స్‌మెంట్ నిలిపివేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం
- కమీషన్లు వచ్చే పనులకే నిధులు
- మాజీ మంత్రి హరీష్‌రావు
మానకొండూరు, జూన్ 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో అన్ని స్కాంలేనని.. హ్యాం రోడ్లు, సింగరేణి, సివిల్ సప్లై, భూములు, తదితర శాఖల్లో జరిగే అవినీతి, ఆయా మంత్రులకు సైతం తెలియలేదంటే జాలేస్తుందని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశా రు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, అలుగునూర్‌లో మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య నాయ కుల కార్యకర్తల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు.
రైతులను, పేదలతో పాటు అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తుందని మండిపడ్డారు. ఓటమి అంచున ఉన్నవారే కేసులు పెడతారని, వారు ఎన్ని కేసులు పెడితే.. అంత బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఉప్పు, పప్పు, బియ్యం కొను గోలుతో సహా అన్ని స్కామ్ లేనని ఆయన అన్నారు.
కరీంనగర్ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు తను సవాల్ విసిరితే.. వారు రెండు వేల కోట్ల స్కాం అంటున్నారు, గురుకులాల కోసం మేము కొన్నదే 680 కోట్లని.. రెండు వేల కోట్ల వ్యయమని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారని చెప్పారు. మం త్రుల పరిస్థితి చూస్తే జాలేస్తుందని, మీరు మంత్రులుగా ఉన్న శాఖల్లో ఏమి జరుగుతుందో మీకు అసలు తెలియని అయోమయ పరిస్థితిలొ ఉన్నారన్నారు. బట్టలు, బూట్లు, టైలు, తదితరాలకు 12 వందల కోట్ల టెండర్ పిలిచారని చెప్పారు.
ఉప్పు, పప్పులకు, కూరగాయలకు, చికెన్, మటన్, కోడిగుడ్లకు రూపాయలు 800 కోట్లతో టెండర్లు పిలిచారని.. రెండు టెండర్ల వ్యయం కలిపితే 2,000 కోట్ల టెండర్ పిలిచామనే విషయం మంత్రులకు తెలియకపోతే ఏమి పాలన చేస్తున్నారో అర్థం కావడం లేదని హరీష్‌రావు విమర్శించారు. ఏనుముల వారి అన్నదమ్ములే ఈ నిధులు మింగుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక కేసీఆర్ హ యాంలో స్కీంలు చేపడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు స్కాంలకు పాల్పడుతుందని అని హరీష్ రావు అన్నారు.
మేనిఫెస్టోలో చెప్పకపోయినా, కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి లాంటి స్కీంలను కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తే.. సివిల్ సప్లులో, సిం గరేణిలో, హామ్ రోడ్లలో, పిల్లలకు అన్నం పెట్టే గుడ్లలో, బట్టలలో రేవంత్ సర్కార్ స్కాములు చేస్తున్నదని ఆరోపించారు. ఉపాధి కూలీలకు రూ.12వేలు ఇవ్వడం లేదని, మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న రేవంత్ కుటుంబం కోటీ శ్వరులు అవుతున్నారని విమర్శించారు.
డిస్కం బూతం రాబోతుంది..
కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమై న కరెంటు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు గంటలకు తగ్గిందని, రైతు డిస్కంను ప్రవేశపెట్టి ఆరు ఏడు గంటలకే కుదించనున్నారని హరీష్‌రావు తెలిపారు. రైతు డిస్కం పేరిట సోలార్, విండ్ పవర్ ఇచ్చేలా చూస్తున్నారని, రాత్రి పూట కరెంటు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసేందుకు రైతు డిస్కంలను తీసుకురానున్నారని ఆరోపించారు.
రీయింబర్స్‌మెంట్..
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వక విద్యా ర్థులు ఇబ్బంది పడుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. బలహీనవర్గాల పిల్లలంటే రేవం త్‌కి ఇష్టం లేదన్నారు. సీఎం, మంత్రులు రీఎంబర్స్‌మెంట్ విషయం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నత విద్యకు 30లక్షల మంది విద్యార్థులు దూరమై ఒక తరం వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బు లిస్తున్న రేవంత్ విద్యార్థులకు ఇచ్చేందుకు మనస్సు రావడం లేదని విమర్శించారు.
మన ఓట్లు జాగ్రత్త..
ప్రతీ 20 ఏళ్లకోసారి ఓటరు జాబితా సవరణ (సర్) ని ఎన్నికల కమిషన్ చేపడుతుందని, దీనిపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విచారణ సమయంలో అధికారుల వెంట బీఆర్‌ఎస్ బూత్ ఇంచార్జీలు ఉండాలని సూచించారు. రివిజన్ సమయంలో ఇతర పార్టీల వారి పేర్లను తొలగించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా గమనించాలని తెలిపారు. 2001 జరిగిన ఎన్నికల్లో ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి మానకొండూరు, తిమ్మాపూర్, కేశవపట్నం అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచిన నియోజకవర్గం మానకొండూర్ అన్నారు.
బీ ఆర్‌ఎస్‌కు పట్టున్న, బలగం ఉన్న నియోజకవర్గాల్లో మానకొండూరు ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పారు. కల్లాల్లో ధాన్యం ఇంకా ఎప్పుడు కొంటారని నిలదీశారు. రైతుబంధు మూడు దఫాలుగా మొత్తం 19 వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారని చెప్పారు. రైతుబంధు నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు బీమా పథకంపై పట్టిం పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బోనస్ బోగస్‌గా తేలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఏమైంది అని నిలదీశారు. పత్రికలకు ఫుల్ పేజీల ప్రకటనలు, ఢిల్లీకి మూటలు పంపి, పేదల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రియల్ ఎస్టేట్, కమిషన్ల కోసమే రేవంత్ ఆరాటమని హరీష్‌రావు ఆరోపించారు.
సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక ష్ణారావు, ఇంచార్జీ రవీందర్ రావు, కార్పోరేటర్ కాల్వ మల్లేశం, నాయకులు రవీందర్ సింగ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, చల్ల హరిశంకర్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్, సిద్దం వేణు, శేఖర్ గౌడ్, స్వామిరెడ్డి, ఏకానందం, నాయిని వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






