గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి: జూన్ 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం లోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. మంగళవారం గంగాధర క్యాంపు కార్యాలయంలో బోయినపల్లి మండ లానికి మంజూరైన అభివృద్ధి నిధుల మంజూరు కాపీని ఆయా గ్రామాల నాయకులకు అందించారు.
ఈ సందర్భంగా ఏం ఎల్ ఏ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కోరెం, బూరుగుపల్లి, నర్సింగాపూర్, రామన్నపేట, విలాసాగర్, దుండ్రపల్లి గ్రామాల ఆలయాల, సామాజిక భవనాలకు, అంబేద్కర్ భవన నిర్మాణంతో పాటు ప్రహరీ గోడల నిర్మాణం కు రూ. 46.75 మంజూరు ధ్రువ పత్రాలు అందించినట్లు ఆయన చెప్పారు.
నాయకులు, కార్యకర్తలు ప్రజలు సమిష్టిగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని ఏం ఎల్ ఏ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్ యాదవ్, ఏ ఏం సీ ఛైర్మన్ బోయిని ఏల్లేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వన్నెల రమణ రెడ్డి,సర్పంచులు శ్రీనివాస్, మోహన్, కనుకయ్య తది తరులు పాల్గొన్నారు.






