17 June, 2026 | 4:04 AM

బస్తీల్లో పర్యటించిన మన్నె గోవర్ధన్ రెడ్డి

17-06-2026 02:46 AM

ఖైరతాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని గాంధీపుర, దేవరకొండ బస్తీలలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవ ర్ధన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ మేర కు మంగళవారం నిర్వహించిన పర్యటనలో భాగంగా బస్తీల్లో నెలకొన్న వీధి దీపాల సమస్యలతోపాటు కొత్తగా నిర్మించిన నాలా పను లు పూర్తయినప్పటికీ అక్కడి మట్టిని తొలగించకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బం దులను ఆయన గుర్తించారు.

ఈ విషయాలపై ఆయన వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారు లతో ఫోన్లో మాట్లాడారు. పేరుకుపోయిన మట్టిని తక్షణమే తొలగించి ప్రజల సమస్య ను పరిష్కరించాలని ఆదేశించారు. మరోవై పు గాంధీపుర బస్తీలో మధ్యలోనే నిలిచిపోయిన కమిటీ హాల్ పైఅంతస్తు నిర్మాణ పను లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కమిటీ హాల్ ముందు సీసీరోడ్డు వేసిన తర్వాత మిగిలిపోయిన రాళ్లు, మట్టిని వెంటనే క్లియర్ చేయాలని, దాని పక్కనే ప్రమాదకరంగా వంగి ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించా లని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రామచందర్, సారంగపాణి, శశిరాజు, కోటేష్, ఫయాజ్ తదిత రులు పాల్గొన్నారు.