హఫీజ్‌పేట్ కుమ్మరిబస్తీలో ఏళ్ల వివాదం ముగింపు
యువనాయకుడు ధాత్రీనాథ్ గౌడ్ చొరవతో సీసీరోడ్డు పనులు వేగవంతం
శేరిలింగంపల్లి, జూన్ 16 (విజయక్రాంతి): ఓల్ హఫీజ్పేట్ నుండి జనప్రియ నగర్కు వెళ్లే దారిలోని కుమ్మరిబస్తీలో గత రెండున్నర సంవత్సరాలుగా బస్తీ వాసులు ఒక ప్రైవేట్ యజమాని మధ్య జరుగుతున్న వివాదం కారణంగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది.ఈ వివాదం స్థానికులు విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకోవడంతో ఈ రోడ్డు మీదుగా రోజుకు 200కి పైగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు.
వారి రోజువారీ ఇబ్బందులను గుర్తించిన హఫీజ్పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ ఇరు వర్గాలకు మధ్యవర్తిత్వం వహించి, దీర్ఘకాలిక వివాదాన్ని సమసిపోయేలా రాజీ కుదుర్చారు.ఆయన చొరవ వల్ల రెండున్నర సంవత్సరాలు వివాదం ముగిసింది.ఈ నేపథ్యంలో మంగళవారం కుమ్మరిబస్తీలో సీసీరోడ్డు నిర్మాణ పనులను ధాత్రీనాథ్ గౌడ్ స్వయంగా పర్యవేక్షించారు. పనులు వేగంగా పూర్తి చేయడం ద్వారా స్థానికులు, ముఖ్యంగా విద్యార్థుల ఎంతో మేలు చేస్తుందని ఆయన వ్యక్తం చేశారు.ఈ చర్యపై స్థానిక మహిళలు, కాలనీవాసులు ధాత్రీనాథ్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.






